
దండుమైలారంలో భారీ వర్షం
ఇబ్రహీంపట్నం: వర్షం దంచికొట్టింది. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు రికార్డు స్థాయిలో దండుమైలారంలో 105.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 26.8 మి.మీటర్లు, మంగల్‌పల్లిలో 12.3 మి.మీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం వెళ వర్షం ప్రారంభంకావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గింది. గురువారం ఇబ్రహీంపట్నంలో 44.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. పదిహేను రోజులుగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.