మహిళలకు ఆరోగ్య రక్ష | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఆరోగ్య రక్ష

Sep 18 2025 10:36 AM | Updated on Sep 18 2025 10:36 AM

మహిళల

మహిళలకు ఆరోగ్య రక్ష

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ‘స్వస్థ్‌ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌’

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల: నారీ శక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ ఆరోగ్య మహిళ–శక్తివంతమైన కుటుంబం (స్వస్థ్‌ నారీ స్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌) కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబానికి భరోసా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని.. పార్లమెంట్‌లోనూ మహిళల ప్రాతినిథ్యం ఉండాలని వారికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రదాని జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మహిళలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డివిజన్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్యసేవలను అందించారు. టీబీ రోగులకు ఆరోగ్య కిట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం, చేవెళ్ల తహసీల్దార్‌ కృష్ణయ్య, జిల్లా అధికారి షఫీయుద్దీన్‌, ఉప వైద్యాధికారి నాగేంద్రబాబు, డివిజన్‌ వైద్యాధికారుల బృందం, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ మున్సిపల్‌, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌, అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేజీఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో యువత పెద్ద ఎత్తున రక్త దానం చేసింది. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి రక్తదాతలకు సర్టిపికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్‌ వైభవ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, శర్వలింగం, కృష్ణగౌడ్‌, మాణిక్యంరెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, రవీందర్‌రెడ్డి, అశోక్‌, జైశంకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, సత్యనారాయణ, రుషికేష్‌, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, ధనుష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నాగరాజు, జైసింహ, కరుణాకర్‌, వెంకట్‌రెడ్డి, శివ, మధూకర్‌, కృష్ణారెడ్డి, రవి, కుమార్‌ తదితరులు ఉన్నారు.

హిమాయత్‌నగర్‌ కంజర్ల మాల్‌లో..

మొయినాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బుధవారం బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్‌ కంజర్ల మాల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నియోజకవర్గ కన్వీనర్‌ వెంకటేశ్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ రత్నం, నాయకులు వెంకటేశ్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

దేశ ప్రతిష్టను చాటిన వ్యక్తి మోది..

మహేశ్వరం: దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటిన మహోన్నత వ్యక్తి ప్రధాని మోది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్‌ అన్నారు. బుధవారం నరేంద్రమోది జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్‌భూపాల్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశ ప్రధాని పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా 75 మంది యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌, పార్టీ రాష్ట్ర నాయకులు పాపయ్యగౌడ్‌, మండల అధ్యక్షుడు యాదీశ్‌, నాయకులు అనంతయ్యగౌడ్‌, మాధవాచారి, యాదయ్య గౌడ్‌, వెంకటేశ్‌ గౌడ్‌, సుదర్శన్‌ యాదవ్‌, శ్రవణ్‌, దేశ్యానాయక్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు ఆరోగ్య రక్ష 1
1/1

మహిళలకు ఆరోగ్య రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement