
అవసరం మేరకు యూరియా
ఇబ్రహీంపట్నం రూరల్: రైతుల అవసరం మేరకు జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. మండల పరిధిలోని పోల్కంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో విక్రయిస్తున్న యూరియా కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వ చేసే గోదాము ఈపాస్ మిషన్ ద్వారా విక్రయాలను పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. యూరియా కోసం తిప్పలు పడాల్సిన అవసరం లేదని, కావాల్సినంత ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులు తప్పనిసరిగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద పంటలను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఓ హరినాథ్, ఏఈఓ సృజన, పీఏసీఎస్ సీఈఓ లక్ష్మయ్య, ఎస్‌ఐ చందర్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన వద్దు
మంచాల: యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మంచాల పీఏసీఎస్ కార్యాలయాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెదిరె హన్మంత్‌రెడ్డి, డైరెక్టర్ వెంకటేశ్, ఏఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఉష