
మరో పది చోట్ల విజయ డెయిరీ పార్లర్లు
కడ్తాల్: తెలంగాణ పాడిపరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో విజయ డెయిరీ పాల ఉత్పత్తులను విక్రయించేందుకు త్వరలో జిల్లాలో పది చోట్ల విజయ డెయిరీ పార్లర్‌లను ప్రారంభించనున్నట్లు షాద్‌నగర్ డివిజన్ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ మురళి అన్నారు. మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో పాల సేకరణ, స్వచ్ఛత, నాణ్యతా ప్రమాణాలపై మంగళవారం మేనేజర్, సిబ్బందితో సమావేశమయ్యారు. నాణ్యమైన పాలసేకరణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా ముందజలో ఉందని, సేకరణలో రాష్ట్రంలోనే కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం ముందువరుసలో ఉందని తెలిపారు. జిల్లాలోని కందుకూరు, ఆమనగల్లు, కొందుర్గు, షాద్‌నగర్, షాబాద్, తుక్కుగూడతో పాటు మరో నాలుగు చోట్ల విజయ పాల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంసీసీ మెనేజర్ ప్రాణేశ్‌కుమార్, క్వాలిటీ కంట్రోలు అధికారిణి ఉదయశ్రీ, సూపర్‌వైజర్ లింగస్వామి పాల్గొన్నారు.
షాద్‌నగర్ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మోహన్‌మురళి