
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కదండి శ్రీరామ్ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థను గాడిలో పెడతామని గొప్పలు చెప్పి, అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా విద్యార్థులను అరిగోస పెడతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. పోలీసులు నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు దొంతగోని శివకృష్ణ, శ్రీకాంత్, మహేశ్, స్టేట్ లా సెల్ కన్వీనర్ సాయి చరణ్, విభాగ్ కన్వీనర్‌లు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల మంజూరులో ప్రభుత్వం విఫలం
ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కదండి శ్రీరామ్