
సాయుధ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం
షాద్‌నగర్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య అన్నారు. పట్టణంలోని పెన్షనర్స్ భనవంలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మిక హక్కు లను కాలరాస్తున్నాయని, కార్మిక చట్టాలను అమ లు చేయడం లేదని విమర్శించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటాలను స్మరించుకుంటూ అన్ని వర్గాల వారు హక్కుల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, బుద్దుల జంగయ్య, నాయకులు షకీల్, గోవింద్ నాయక్, నర్సింహ, గడ్డం జంగయ్య, వెంకటేశ్, లింగం నాయక్, చంద్రబాబు పాల్గొన్నారు.
పోరాటానికి మతం రంగు పూయొద్దు
కందుకూరు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పూయొద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య అన్నారు. మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం పార్టీ మండల కార్యదర్శి కొమ్మగళ్ల రాజు ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాటి పోరాటంతో ఎలాంటి సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మతోన్మాదంతో చరిత్రను వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సభ్యుడు పానుగంటి పర్వతాలు, ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.దత్తునాయక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పట్నాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య