
ప్రకృతి సంపదను కాపాడుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రకృతి సంపదను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని కొంగరకలాన్ జెడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజేఆర్) పర్యావరణ సంస్థ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా యంగ్ ఎర్త్ లీడర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్‌రెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల తోట, ఇంకుడు గుంత, కంపోస్టు పిట్, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యం కారణంగా భూ గ్రహం వేడెక్కుతుందని దాని సంరక్షణకు ఎర్త్ లీడర్స్ విద్యార్థి దశ నుంచి పర్యావరణ స్పృహ పెంచుకోవాలన్నారు. ఇందుకు గ్రీన్ రెవెల్యూషన్ తోడుగా ఉంటుందన్నారు. పాఠశాల ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. బడిలోనే కూరగాయల తోటలు పెంచుకోవాలని చెప్పారు. అడవులు విస్తారంగా ఉంటేనే వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని.. దీంతో భూగర్భజలాలు పెరిగి పంటలు పండించుకునేందుకు అనుకూలంగా ఉంటుందని వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రాజేశ్వర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత, ఉపాధ్యాయులు కరుణాకర్, సమత, రామచంద్రయ్య, యాదయ్య, శ్రీవేణి, భాస్కర్, పాండు, ఎర్త్ లీడర్స్ నిహారిక, నిఖిల్, సౌరబ్, నాని, లాస్య, శ్రవణ్, లాస్య, అక్షయ, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ రజినీకాంత్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
కందుకూరు: ప్రకృతి సంపదను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి పిలుపునిచ్చారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ, పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం మీర్‌ఖాన్‌పేట జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల తోట, ఇంకుడు గుంత, కంపోస్ట్ పిట్, కిచెన్ గార్డెన్, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, ఉపాధ్యాయులు రామ్మోహన్‌రావు, ఎర్త్ లీడర్స్ భానుశ్రీ, సింధుప్రియ, కావ్య, దివ్య, ప్రభాస్, యూసుఫ్‌బాబా, మురళీ, నవదీప్, వరుణ్, ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డీనేటర్ రజనీకాంత్, రాఘవేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి