
జాతీయస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థులు
అబ్దుల్లాపూర్‌మెట్: జాతీయ స్థాయి అత్యపత్య పోటీలకు పెద్దఅంబర్‌పేట్ రాజశ్రీ విద్యామందిర్ పాఠ శాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు అత్యపత్య సంఘం జిల్లా అధ్యక్షుడు నాయిని పోచారం సంజీవరెడ్డి తెలిపారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 10న నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాజశ్రీ విద్యామందిర్ పాఠశాలకు చెందిన కె.నిహాంత్ రెడ్డి (9వ తరగతి) జె.లక్ష్మి గురుదీక్ష (8వ తరగతి), పి.భావన (9వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో వీరికి ఈ నెల 17 నుంచి 21 వరకు మహారాష్ట్రలోని మల్కాపూర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో అవకాశం కల్పించారని పాఠశాల కోచ్ నీలేశ్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల యాజమాన్యం సిద్ధంకి జగన్మోహన్ రెడ్డి, హెచ్‌ఎం రాజేశ్వరి, అత్యపత్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మైలారం ప్రభాకర్ విద్యార్థులను అభినందించారు.
జిల్లా స్థాయి టీఎల్‌ఎంకు బాటసింగారం పాఠశాల
అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలో మంగళవారం బోధనోపకరణాల మేళా(టీఎల్‌ఎం మేళా)ను అట్టహాసంగా నిర్వహించారు. ఎంఈఓ జగదీశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ మేళాలో మండల పరిధిలోని 52 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొని బోధనోపకరణాలను ప్రదర్శించారు. ఇంగ్లిష్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బాటసింగారం జెడ్పీహెచ్‌ఎస్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం సంతోషను ఎంఈఓ అభినందించారు.

జాతీయస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థులు

జాతీయస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థులు

జాతీయస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థులు