
కోడి పందేల స్థావరంపై దాడి
● ఇద్దరు పందెంరాయుళ్లు అరెస్ట్
● మూడు పందెం కోళ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
ఇబ్రహీంపట్నం రూరల్: కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు పందెం రాయుళ్లను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ నోయల్‌రాజ్ తెలిపిన ప్రకారం.. మన్నెగూడ అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తమ సిబ్బంది దాడి చేయగా తుర్కయంజాల్‌కు చెందిన తన్నీరు వేణుగోపాల్(32), కట్టంగూర్‌కు చెందిన దాచేపల్లి శేషగిరిరావు(40)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల రాకను గుర్తించిన పులువురు అక్కడ నుంచి పరారయ్యారు. వారి వద్ద మూడు పందెం కోళ్లను, రెండు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు.