
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
చేవెళ్ల: కేంద్రం ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరులో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, తంగడపల్లిలో రూ.9 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను గురువారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీలకు పైసా విడుదల చేయకుండా పాలనను అస్తవ్యస్తంగా మారుస్తోందని విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు పదేళ్లుగా కేంద్రం అందించే నిధులే దిక్కవుతున్నాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. మరిన్ని నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఎ.అనంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్, శర్వలింగం తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి