
హేయమైన చర్య
సాక్షి పత్రిక, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని హేయమైన చర్యగా వివిధ సంఘాల నేతలు అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సరికాదని, పత్రికా స్వేచ్ఛను హరించొద్దని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్న సాక్షి పత్రిక, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు ఉంటారు. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురితమైతే సంబంధిత శాఖ అధికారులు ఖండించొచ్చు లేదంటే పరువు నష్టం దావా వేసుకునే వీలు చట్టంలో ఉంది. అక్రమ కేసులు బనాయించడం, దాడులకు తెగబడడం అవివేకం.
– ఎం.డి.నసీర్ పాషా, హైకోర్టు న్యాయవాది, మహేశ్వరం
జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీ లో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించడం సహజం. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు.
– చందోజీ, సామాజిక కార్యకర్త, కడ్తాల్
సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ సరికాదు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా అక్కడి ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కడం సరి కాదు. – లక్ష్మణ్‌కుమార్, యువసత్తా యూత్ అధ్యక్షుడు, షాద్‌నగర్
ప్రజాస్వామ్య దేశంలో ప్రతికలపై దాడి చేయడం ఏమాత్రం సరి కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలు పాత్రికేయులపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు, జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించడం తగదు.
– నర్సింలు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
పత్రికా స్వేచ్ఛపై దాడిచేయడం రాజ్యాంగానికి విరుద్ధం. పత్రికా స్వేచ్ఛ రాజ్యా ంగం కల్పించిన హక్కు. పత్రికారంగాన్ని రాజకీయ కోణంలో చూడటం తగదు. ఉద్దేశ పూర్వకంగా మీడియాపై కేసులు పెట్టడం సరికాదు. మీడియాలో పాలకపక్షం వార్తలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు వార్తల రూపంలో వస్తాయి. తప్పుడు వార్తలు వస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి.
– రాఘవేందర్‌గౌడ్, టీడబ్ల్యూజేఎఫ్
డివిజన్ అధ్యక్షుడు, షాద్‌నగర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోంది. జర్నలిస్టుల గొంతు నొక్కడమంటే ప్రజా హక్కులను హరించడమే. నిర్భందాలు, దాడు లతో వాస్తవాలను దాచలేరు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఏపీ కూటమి ప్రభుత్వ చర్యలను సమాజం హర్షించదు. – వై.గీత, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి

హేయమైన చర్య

హేయమైన చర్య

హేయమైన చర్య

హేయమైన చర్య

హేయమైన చర్య

హేయమైన చర్య