
ఏఐతో గణనీయమైన మార్పులు
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థుల భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ముడిపడి ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కృత్రిమ మేధపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాలకిష్టారెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో సమాజంలో ఏఐతో గణనీయమైన మార్పులు వస్తాయని అన్నారు. కృత్రిమ మేధపై విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. గురుకులాల రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ నాగార్జునరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ జీఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. విద్యావిధానంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన డిగ్రీ గురుకులాల డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్‌రావు, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల, గిరిజన గురుకుల డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
ప్రైవేట్ పరిశ్రమల సౌజన్యంతో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అరబిందో ఫార్మా కంపెనీ సౌజన్యంతో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జీఎన్ శ్రీనివాసన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల, ఫార్మాకంపెనీ ప్రతినిధి ఆనంద్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి