
యూరియా కోసం ఆందోళన వద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: రైతులకు అవసరమైన యూరియా ప్రభుత్వం సరఫరా చేస్తోందని జిల్లా వ్యవసాయాధికారి ఉష తెలిపారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఎంపీపటేల్‌గూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరియా నిల్వలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడారు. యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అధిక మొత్తంలో బస్తాలు కొని నిల్వ చేసుకోవద్దని సూచించారు. అనంతరం ఎంపీ పటేల్‌గూడలోని మెట్టు అశోక్‌రెడ్డి పండిస్తున్న వరి మేలు కేఎన్‌ఎం 1638 రకం పంటను పరిశీలించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏడీఏ సుజాత, ఏఓ విద్యాధరి, ఏఈఓ శ్రవణ్‌కుమార్, సహకార సంఘం సీఈఓ మాధవి, మాజీ చైర్మన్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఉష