
అక్టోబర్ 12 నుంచి పల్స్‌పోలియో
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఐదేళ్లలోపు ఉన్న ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు సూచించారు. ఈ మేరకు గురువారం శివరాంపల్లిలోని జిల్లా కార్యాలయంలో సంబంధిత వైద్యు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 12న పోలియో బూత్‌ల్లో చుక్కలు వేస్తారని, 13 నుంచి 15వ తేదీ వరకు నేరుగా ఇళ్లలోకి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందిని, ఆరోగ్య కార్యకర్తలను, ఆశ కార్యకర్తలను, మహిళా గ్రూపులను భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎంఓ డాక్టర్ మురారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శిభహయత్, జిల్లా ఉపవైద్యాధికారులు డాక్టర్ విజయ పూర్ణిమ, డాక్టర్ గీత, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సుధ, పోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు