
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
షాబాద్: యూరియా పంపిణీలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్‌లో గురువారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియా సరఫరాపై ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళలు కనిపించినప్పుడు నా అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేస్తానని మాటలు చెప్పడం తప్ప ఒక్క హామీ అమలు చేసింది లేదని దుయ్యబట్టారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యక్తరలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. రెండేళ్లుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, మహిళలు ఎలా శాపనార్థాలు పెడుతున్నారో చూస్తున్నామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్‌ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరడం సిగ్గు చేటన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాష్‌రెడ్డి, నాయకులు కౌశిక్‌రెడ్డి, దేశమల్ల ఆంజనేయులు, పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సబితారెడ్డి