
విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు
చేవెళ్ల: విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని చేవెళ్ల ఏసీపీ బి.కిషన్ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కేజీబీవీలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు మాలతి విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో జ్ఞానం అనే వెలుగులు ప్రసాదించేది తల్లిదండ్రుల తరువాత గురువులే అన్నారు. అనంతరం విద్యార్థులను అడిగి పాఠశాల సమస్యలను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా మాలతి కృష్ణారెడ్డి మాట్టా డుతూ.. విద్యార్థులకు అవసరమైన ఆట స్థలంతో పా టు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, నాయకులు ఎన్.కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విలువలు నేర్పేది గురువే: ఏసీపీ లక్ష్మీనారాయణ
షాద్‌నగర్: విద్యార్థులకు జీవిత విలువలను నేర్పించేది గురువులేనని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఇంటర్నేషల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఉపాద్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రదమైనదని, ఉపాధ్యాయుడు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. విద్యార్థుల్లోని చీకటిని తొలగించి వెలుగులు నింపేవారే ఉపాధ్యాయుడని అన్నారు. ప్రతీ విజయంలో కీలక పాత్ర గురువుదేనని అన్నారు. విద్యార్థులు గురువులను దైవంగా భావిస్తూ వారి సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు సాగితే విజయతీరాలకు చేరుకుంటారని అన్నారు. ప్రతి విద్యార్ధి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఉపాధ్యాయులు మంచి పునాదులు వేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ నాగరాణి, ఏబీవీ ఆస్పత్రి వైద్యులు ఆనంద్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఏసీపీ కిషన్

విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు