
సర్వం సిద్ధం
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
శోభాయాత్రకు..
బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గణేశుడి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తజనం పూజలు అందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం పూజలు నిర్వహించి, ఇప్పటికే సిద్ధం చేసుకున్న వాహనాల్లో ఆయా వినాయకులను సమీప చెరువులు, కుంటలకు తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. శనివారం శోభాయమానంగా నిర్వహించే వేడుకలకు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించే శోభయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా స్వాగత ద్వారాలు, ట్యాంక్‌బండ్ సహా సరూర్‌నగర్, తుర్కయంజాల్ మాసబ్ చెరువుల వద్ద భారీ క్రేన్లను సిద్ధం చేశారు. ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం విద్యుత్‌శాఖ ఆయా చెరువులు, కుంటల వద్ద అదనపు ఏర్పాట్లు చేసింది.
మినీట్యాంక్ బండ్‌పై..
సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై ఎనిమిది క్రేన్లు సిద్ధం చేశారు. కట్ట మొత్తం ఇప్పటికే విద్యుత్ దీపాలతో అలంకరించారు. నిరంతర నిఘా కోసం 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3,504 విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు. చివరి రోజైన శనివారం మరో మూడు వేలకుపైగా విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, ఎన్‌టీఆర్ కాలనీ, నాగోలు, ఎల్బీనగర్ మీదుగా వచ్చే వాహనాలను కర్మన్‌ఘట్ మీదుగా సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించనున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించనున్నారు.
తుర్కయంజాల్ మాసబ్ చెరువు కట్టపై..
తుర్కయంజాల్ మాసబ్ చెరువు కట్టపై ఒక క్రేన్ ఏర్పాటు చేశారు. భక్తులు, ఇతర సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. కట్టపై భారీ విద్యుత్ లైట్లు సహా వైద్య శిబిరం, విద్యుత్ కాల్ సెంటర్, జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేశారు. తుర్కయంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సహా ఇతర అధికారులకు ఇక్కడ విధులు కేటాయించారు. గజ ఈతగాళ్లను సైతం సిద్ధంగా ఉంచారు.
వేలాదిగా తరలిరానున్న వినాయక విగ్రహాలు
దారి పొడవునా భారీ బందోబస్తు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు
సరూర్‌నగర్ మినీట్యాంక్‌బండ్,
మాసబ్ చెరువు వద్ద ఏర్పాట్లు

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం