
ఆ కార్యక్రమాలను జయప్రదం చేయాలి
కందుకూరు: తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుబ్బాక రాంచందర్ అధ్యక్షతన జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి 17 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా సభలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈనెల 17న ఖమ్మం జిల్లా జనగామలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి అఖిల భారత కార్యదర్శి ఎంఏ బేబి ముఖ్యఅతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈనెల 12న సీతారాం ఏచూరి వర్ధంతిని అన్ని జిల్లాలు, మండలాల్లో జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.సామేల్, చంద్రమోహన్, కె.జగన్, ఇ.నరసింహ, కె.భాస్కర్, జగదీశ్, కవిత పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ