
కన్హాలో ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతివనంలో బీఏటీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న యోనెక్స్ సన్‌రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2025 పోటీలు శుక్రవారంతో ముగిసాయి. విజేతలకు పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సాధారణమేనని అన్నారు. ఒక ఓటమి మరో విజయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. పురుషుల విభాగం సింగిల్స్‌లో తమిళనాడుకు చెందిన రిత్వీక్ విన్నర్‌గా, కేరళకు చెందిన గోవింద్ రన్నర్‌గా, మహిళల సింగిల్స్ విభాగంలో కర్ణాటకకు చెందిన సైనా విన్నర్‌గా, కర్ణాటకకే చెందిన రాజేష్ లక్షా రన్నర్‌గా నిలిచారని తెలిపారు. పురుషులు డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీవీహెచ్ వర్ధన్ రాయుడు, విష్ణుకేదార్ విన్నర్‌గా, పాండిచ్చేరికి చెందిన కృష్ణన్ మిత్లేష్, ప్రీజన్ రన్నర్‌గా నిలిచినట్టు వెల్లడించారు. మహిళల డబుల్స్ విభాగంలో తమిళనాడుకు చెందిన రిద్‌వర్షిణి, సింకేదర్ సానై విన్నర్‌గా, తెలంగాణకు చెందిన ఆలీషా మహముద్, వైష్ణవి రన్నర్‌గా నిలిచినట్టు వివరించారు.