
బీసీల పేరుతో డ్రామాలు
బడంగ్‌పేట్: బీసీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని, బీసీల పేరుతో ముస్లింలకు కేటాయిస్తున్న రిజర్వేషన్ ఎత్తివేస్తే బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్ పార్టీ కార్యాలయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారి అడుగుపెట్టిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బీసీలకు వ్యతిరేకం అని కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. తమది అందరి పార్టీ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు