
సమాజంలో యువత పాత్ర కీలకం
శంకర్‌పల్లి: సమాజంలో యువతది కీలక పాత్ర అని, చదువుకునే సమయంలోనే తమ భవిష్యత్తును ఎంచుకోవాలని యాంటీ నార్కోటిక్స్ ఎస్పీ సీతారాం అన్నారు. దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో పది రోజుల పాటు నిర్వహించిన దీక్షారంభ్ ముగింపు వేడుకులకు శుక్రవారం హాజరైన ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలు తీసుకొని బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఇక్ఫాయ్ వీసీ ఎల్.ఎస్.గణేశ్, లా స్కూల్ ప్రొ. రవిశేఖర రాజు తదితరులు పాల్గొన్నారు.