
స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి
షాద్‌నగర్‌రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు పిట్టలసురేష్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్‌భూపాల్‌గౌడ్ మాట్లాడుతూ.. త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవులను కై వసం చేసుకునే విధంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెబాబయ్య మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్ట పడితే విజయం మనదేనని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ఇన్‌చార్జి ఇస్నాతి శ్రీనివాస్, బీజేవైఎం నాయకుడు వంశీకృష్ణ, నాయకులు ఎంకనోళ్ల వెంకటేశ్, లష్కర్‌నాయక్, శ్యాంసుందర్‌రెడ్డి, రఘుగౌడ్, గణేశ్, నర్సింలు, వెంకటేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్