
మహిళలు స్వశక్తితో ఎదగాలి
ఇబ్రహీంపట్నం: మహిళలు స్వశక్తితో ఎదిగి, కోటీశ్వరులుగా మారేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. స్థానిక శాస్త్రా గార్డెన్‌లో సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల మహిళ సంఘాల సభ్యులతో కలిసి ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. 3,642 సంఘాలకు రూ.3.93 కోట్ల వడ్డీ (5 నెలలు) మాఫీ, 21 మందికి లోన్ బీమా రూ.19 లక్షలు, ఇద్దరికి ప్రమాద బీమా కింద రూ.20 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు తీసుకున్న రుణాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మహిళలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నియోజకవర్గంలో 20 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 3,500 వేల ఇళ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షలు కాకుండా డ్వాక్రా సంఘాల ద్వార మరో రూ.2లక్షల రుణాలను అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, ఎంపీడీఓ జంగయ్యగౌడ్, పార్టీ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, మంఖాల దాసు, రాచర్ల వెంకటేశ్వర్లు, జడల రవీందర్‌రెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు జయమ్మ, అమృతసాగర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి