
● సీఎంతో వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్‌వ్యాధులపై అప్రమత్తత, రేషన్‌కార్డుల పంపిణీ పురోగతి అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జిల్లా వ్యవసాయాధికారి ఉష, ఇతర అధికారు లు తదితరులు పాల్గొన్నారు.