
నేడు షాద్‌నగర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు రాక
షాద్‌నగర్‌ః మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం షాద్‌నగర్‌కు విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 3,418 మహిళా సంఘాలకు రూ.3.29 కోట్ల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని రెడ్‌రోడ్ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇంటర్‌లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు
కడ్తాల్: మండల కేంద్రంలోని కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఓ అనిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లకు గాను 20 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు కేజీబీవీలో సంప్రదించాలని సూచించారు.
ఆర్టీసీలో అప్రెంటీస్‌కు దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విభాగాల్లో మూడేళ్ల అప్రెంటిస్ శిక్షణకోసం దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్, ఐటీ/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ/గణితం విద్యలో ఇంజనీరింగ్, డిప్లొమా, నాన్‌ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు కలిగి ఉండి 2021లో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. దరఖాస్తులను నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం(ఎన్‌ఎటీఎస్) కింద వెబ్ పోర్టల్‌లో ఈ నెల 27 వరకు రిజిస్టర్ చేసుకొని మహబూబ్‌నగర్ రీజియన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్, డిప్లొమా, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌లో మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్ట్‌పై
విద్యార్థులకు అవగాహన
ఇబ్రహీంపట్నం: గోదావరిలో తెలంగాణ రాష్ట్ర వాటాను వదులుకుంటే మరో ఉద్యమం తప్పదని బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్‌కుమార్ హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలోని బీసీ వసతి గృహంలో బనకచర్ల ప్రాజెక్ట్‌పై సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాల మాగాణికి నీరందించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్రకు దోచిపేట్టేందుకు సిద్ధమైందన్నారు. దీనిని తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు కరుణాకర్, ప్రసాద్, మహేశ్, వంశీ, చందు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా పని చేద్దాం
నవాబుపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం నవాబుపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలం అధ్యక్షుడిగా మేడిపల్లి వెంకటయ్యను మరోసారి ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సాగాలని పిలుపునిచ్చారు. ఈ బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు చిట్టెపు మల్లారెడ్డి, నాగిరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎక్ బాల్, సామ వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సంజీవ రెడ్డి, తది తరులు పాల్గొన్నారు.