
సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి
కుల్కచర్ల: సబ్బండ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండల పరిధిలోని కుల్కచర్ల, చాపలగూడెం, తిర్మలాపూర్, లాల్‌సింగ్ తండా, రాంపూర్, కుస్మసముద్రం, అనంతసాగర్ తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాంపూర్, సాల్వీడు గ్రామాల్లోని చెంచు కాలనీలలో రూ. 50లక్షలతో మల్టీపర్పస్ భవనాలను నిర్మించేందుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరిగి నియోజకవర్గ పరిధిలో 3,500మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రతీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 5,143మందికి నూతన రేషన్ కార్డులను అందజేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్‌కుమార్, మాజీ ఎంపీపీ సత్యమ్మ, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ మండల అధ్యక్షుడు పి.వెంకటయ్య, నాయకులు కుమ్మరి స్వామి, లక్ష్మయ్య, కృష్ణయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి