
టీటీడీ నుంచి నిధులు ఇప్పించండి
యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామస్తులు శనివారం ఉదయం నగరంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డిని కలిశారు. గ్రామంలోని రమా సత్యనారాయణస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నామని ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బందె మహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గొట్టే మల్లేశ్, మాజీ సర్పంచ్ రాజశేఖర్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్పల్లి అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికికుర్మిద్ద గ్రామస్తుల వినతి