ఢిల్లీ సీఎంకు ఆచారి శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎంకు ఆచారి శుభాకాంక్షలు

Jul 20 2025 2:27 PM | Updated on Jul 21 2025 5:13 AM

ఢిల్ల

ఢిల్లీ సీఎంకు ఆచారి శుభాకాంక్షలు

కడ్తాల్‌: జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి శనివారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె జన్మదినం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

గంజాయి విక్రేతకు రిమాండ్‌

శంకర్‌పల్లి: గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ, మోకిల పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోకిల ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శిషీర్‌నాథ్‌(28) గతేడాది బతుకుదెరువు కోసం మోకిలకి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను, కొన్ని నెలలుగా గంజాయి అమ్ముతున్నాడు. శిషీర్‌ నాథ్‌ తన స్నేహితుడు గోకులనందనాథ్‌ ఇద్దరూ కలిసి ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి స్థానికంగా కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. పక్కా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ, మోకిల పోలీసులు శనివారం దాడి చేయగా.. శిషీర్‌నాథ్‌ పట్టుబడ్డాడు. ఆయన వద్ద 4.3కిలోల గంజాయి, ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. గోకులనందనాథ్‌ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

పాము కాటుకు రైతు మృతి

కడ్తాల్‌: తలకొండపల్లి మండల పరిధిలోని చుక్కాపూర్‌ లో పాము కాటుకు యువకు డు మృతి చెందాడు. వివరా లు.. గ్రామానికి చెందిన యువ రైతు కడారి తిరుపతి యాదవ్‌ (38) శనివారం సాయంత్రం తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు చెట్ల పొదల్లో ఉన్న పింజర పాము కాటేసింది. వెంటనే బాధితుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఘటనాస్థలికి చేరుకుని పాముని చంపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

శంషాబాద్‌: శంషాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ (రాజేంద్రనగర్‌) కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హిమబిందు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌, బోటనీ, జువాలజీ, గణితం, కంప్యూటర్‌ సైన్స్‌, అప్లికేషన్‌ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టుకు, కామర్స్‌లో రెండు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నా రు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కు లు కలిగి ఉండాలి తెలిపారు. ఈ నెల 23న సాయంత్రం సంబంధిత ధ్రువ పత్రాలతో కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఢిల్లీ సీఎంకు ఆచారి శుభాకాంక్షలు 
1
1/1

ఢిల్లీ సీఎంకు ఆచారి శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement