
సమాజ భద్రతకే కార్డన్ సెర్చ్
నందిగామ: సమాజ భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని శంషాబాద్ డీసీపీ రాజేశ్ అన్నారు. శనివారం నందిగామ, అంతిరెడ్డిగూడ శివారులోని పృథ్వీకాలనీ, అయ్యప్ప స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో నందిగామ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కిరణా దుకాణాలు, పాన్‌షాపులు, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ రాజేశ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో తొమ్మిది హాట్‌స్పాట్‌లను గుర్తించి కార్డన్ సెర్చ్ నిర్వహించామని చెప్పారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 42 ద్విచక్రవాహనాలు, నాలుగుచోట్ల గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి 37 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశామన్నారు. నాలుగు బెల్టు షాపుల్లో మద్యం, 8 కేజీల గుట్కా ప్యాకెట్లను, 285 గ్రాముల గంజాయి స్వాధీనం, ఓ పరిశ్రమలో పనిచేస్తున్న బాల కార్మికుడిని గుర్తించామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, ఆరుగురు సీఐలు, పదిమంది ఎస్‌ఐలు, 20మంది ఏఎస్‌ఐలు, 35 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 170 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
శంషాబాద్ డీసీపీ రాజేశ్