
చర్లగూడ వంతెన పనులు పూర్తి చేయాలి
షాబాద్: చర్లగూడ వంతెన, రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కంపేట ఆంజనేయులు కోరా రు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంఘం నాయకులతో కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. చర్లగూడ గ్రామ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండడంతో ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. మూడేళ్లుగా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేద ని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలకు విద్యార్థులకు, రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గతంలో ఈ వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని గుర్తు చేశారు. చర్లగూడ బ్రిడ్జి, రోడ్డుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నాయకులు చంద్రశేఖర్, మల్లేశ్, అంజయ్య, సత్యనారాయణ, కృష్ణ, రాజు, శేఖర్ తదితరులున్నారు.
పాఠశాల సమస్యలు పరిష్కరించండి
కడ్తాల్: మండల పరిధిలోని చరికొండ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని చరికొండ గ్రామస్తులు శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. పాఠశాలలో గణిత, భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు వెంకటయ్య, మహేందర్‌గౌడ్, కాటం ఉన్నారు.
మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు