
అర్హులందరికీ ఆర్థికసాయం
యాలాల: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల విచారణను శుక్రవారం చేపట్టారు. గోవిందరావుపేట విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణి, పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌రావు, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్‌బాబాతో కలిసి వివరాలు సేకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అందేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగయ్య, నర్సింలు, చందు, ఉమేశ్, రాజు, లాలు, లక్ష్మప్ప, బుడ్డప్ప తదితరులు ఉన్నారు.
మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణి