
భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగవంతం
సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్
చేవెళ్ల: భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా అవుతుందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అన్నారు. చేవెళ్లలోని గణేశ్ స్టీల్ వద్ద భారతి సిమెంట్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తాపీమేసీ్త్రలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణం ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. తెలంగాణలో భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెంటింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్‌తో విడుదల చేసిందన్నారు. అల్ట్రాఫాస్ట్‌తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తున్నామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారని చెప్పారు. అనంతరం 50 మంది తాపీమేసీ్త్రలకు రు.లక్ష ప్రమాద బీమా బాండ్లను అంజేశారు. డీలర్ సదానందం మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ టెక్నికల్ ఇంజనీర్ బృందం, తాపీమేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు.
బస్సులు ఆపాలని వినతి
తుర్కయంజాల్: సాగర్ రహదారి గుండా రాకపోకలు సాగించే ఇబ్రహీంపట్నం డిపో ఆర్టీసీ బస్సులను తుర్కయంజాల్‌లోని కట్టమైసమ్మ దేవాలయం నిలపాలని సీపీఎం నాయకులు కోరారు. బుధవారం ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ నర్సప్ప వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఇంజాపూర్ జోన్ బాధ్యుడు మండల సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆలయం వద్ద బస్సు నిలపకపోవడంతో కమ్మగూడ, ఇంజాపూర్‌లోని అనేక కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ బస్‌స్టాప్‌కు సమీపంలోనే నాలుగు వీకర్ సెక్షన్ కాలనీలు ఉన్నాయని, వీరంతా ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని తెలిపారు. అందుకు ఆర్టీసీ సర్వీసే వారికి ప్రధాన మార్గమన్నారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని గుర్తించి, బస్సులు ఆపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శంకరయ్య, కుమార్, సత్యం, సాయి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ధర్మాస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌కు బీజేపీ నేతలు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు ముత్యాల మహేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పేదలు ఎక్కువ శాతం సర్కారు దవాఖానలకే వస్తుంటారని, అలాంటి వారికి సకాలంలో వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులు పరుగులు తీస్తున్నారని పేర్కొన్నారు. సాయంత్రం నుంచి వైద్యులు ఉండకపోవడంతో ఎమర్జెన్సీ కేసులను చూసే వారు లేరన్నారు. తాత్కాలికంగానైనా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కోరారు. పాలకుల హామీ మేరకు వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. నిరంతరం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ రాఘువేంద్రస్వామి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి విజయ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు అనిల్, మున్సిపల్ కార్యదర్శి సంతోష్ ఉన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు
శంకర్‌పల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని జన్వాడ జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. ఎంఈఓ అక్బర్‌తో కలిసి కేఎన్‌ఏ ఫౌండేషన్ వారు రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ని ప్రారంభించారు. అనంతరం పాఠశాలను విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలరాజ్ పాల్గొన్నారు.
చోరీ సొత్తు రికవరీ
కందుకూరు: చోరీకి పాల్పడిన వ్యక్తిని చాకచక్యంగా గుర్తించి అతని నుంచి బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని జబ్బార్‌గూడకు చెందిన గోల్కండ లక్ష్మి కుటుంబీకులు ఈ నెల 2న ఇంటికి తాళం వేసి పనులపై బయటికి వెళ్లారు. ఇది గమనించిన ఓ దొంగ ఇంట్లో చొరబడి నాలుగు తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలను తస్కరించాడు. ఈ విషయమై అదే రోజు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఎం.రమేష్ ఆ గ్రామంలో దర్యాప్తు చేపట్టాడు. ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా.. క్రైం కానిస్టేబుల్స్ పాండురంగారెడ్డి, శేఖర్ వెళ్లి అనుమానితుడ్ని చాకచక్యంగా పట్టుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో చోరీ సొత్తును సేకరించి బాధితురాలికి అప్పగించారు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.

భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగవంతం

భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగవంతం