
యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం ప్రారంభం
కందుకూరు: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సహకారంతో యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం–2లో భాగంగా ఎంపికై న మండలంలోని నేదునూరు పరిధిలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాడ్జ్‌లు అందించారు. మంగళవారం నాబార్డ్ సంస్థ 44వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్‌లోని వారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్–2ను లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపికై న విద్యార్థులను ఆయన అభినందించి పర్యావరణ సంస్థ అందించిన కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాబార్డ్ సంస్థ ప్రముఖులు ఉదయ్‌భాస్కర్, సీజీఎం రాధాకృష్ణ, సీజీఎం ఎస్‌బీఐ నారాయణరావు, అసిస్టెంట్ డైరెక్టర్ జేఎస్‌ఆర్ అన్నమయ్య, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రజనీకాంత్, మెంటార్ టీచర్ పుష్పలత, ఎర్త్ లీడర్లు పాల్గొన్నారు.