
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం
హుడాకాంప్లెక్స్: పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో ముఖ్యమని డిప్యూటీ డైరెక్టర్ ఎన్.అజిత్‌కుమార్ అన్నారు. జాతీయ గణాంక కార్యాలయం 75వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సరూర్‌నగర్‌లోని వీఎంహోం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ మనుగడకు వృక్షాలు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ఆక్సిజన్ మొక్కల పెంపకం ప్రధానమని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాసరావు, నోడల్ అధికారి భరద్వాజ్, సీనియర్ స్టాటిస్టికల్ అధికారి, క్యూడియర్ స్టాటిస్టికల్ అధికారులు, సర్వే సూపర్‌వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.