
ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పనిసరి
మహేశ్వరం: రైతులంతా ఫార్మర్ రిజిసీ్ట్ర తప్పక చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి డి.ఉష సూచించారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ.. రైతులు పట్టాపాస్ బుక్, ఆధార్, ఆధార్‌కు అనుసంధానం ఉన్న ఫోన్ నంబర్‌తో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య(యూనిక్ కోడ్)ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. రైతు రుణాలు, ఇతర ఆర్థికసాయం పొందేందుకు ఈ నంబర్ తప్పనిసరి అని చెప్పారు. పంటలో కలుపు నివారణ, నానో యూరియా వాడే విధానం, వరి పంట సాగులో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుధారాణి, మండల వ్యవసాయాధికారి నాగమణి, టెక్నికల్ ఏఓ యాదగిరి గౌడ్, ఏటీఎం శ్రీవిద్య, విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఉష