
దివ్యాంగులకు రాయితీపై రుణాలు
జిల్లాకు 42 యూనిట్లు మంజూరు
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా 2025–26 సంవత్సరానికి జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించడానికి పునరావాస పథకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం కింద జిల్లాకు 42 యూనిట్లు మంజూరయ్యాని చెప్పారు. రూ.50 వేలకు 41 యూనిట్లు, రూ.3 లక్షలకు ఒక్కటి రాయితీతో మంజూరు చేశారన్నారు. అవసరమైన దివ్యాంగులు వెబ్‌సైట్‌లో ధ్రువీకరణ పత్రాలు జత చేసి ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన వారికి రుణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 88979 58726 నంబర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5గంటల వరకు సంప్రదించాలన్నారు.
ట్రాన్స్‌జెండర్ల ఉపాధి కోసం దరఖాస్తులు ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లా పరిధిలో నిరు ద్యోగులైన ట్రాన్స్‌జెండర్లకు ప్రైవేట్‌రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పా టు, స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు నైపుణ్య శిక్షణ అందిస్తామని జిల్లా సంక్షేమాధి కారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్, ఫొ టో, వీడియో గ్రఫీ, బ్యుటీషియన్, జ్యూట్ బ్యా గ్ మేకింగ్, టైలరింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో నైపు ణ్య శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 96035 25866 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
వేంకటేశ్వరస్వామి సేవలో హీరోయిన్ రష్మిక
కందుకూరు: సినీ హీరోయిన్ రష్మిక మందన మంగళవారం మండల పరిధిలోని గూడూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆమెను సన్మానించి స్వామి వారి జ్ఞాపిక అందజేశారు.
‘పాలమూరు–రంగారెడ్డి’పై స్పష్టత ఇవ్వాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య
కొందుర్గు: పదేళ్ల క్రితమే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ సర్వేకు రూ.10వేలు కోట్లు నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేటాయించారని.. నేటికీ సర్వే చేపట్టకపోవడం బాధాకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మంగళవారం పార్టీ నాయకులు మాణిక్యరావు, అనిత ఆధ్వర్యంలో జిల్లేడ్ చౌదరిగూడ మండల సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగయ్య మాట్లా డుతూ.. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం స్పష్ట త ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.9 వేల కో ట్ల ఖర్చుతో జూరాల బ్యాక్ వాటరుతో 73 కిలో మీటర్లు నిర్మాణం పనులు చేపడితే 12 మండలాలలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగయ్య, మండల కార్యదర్శి వెంకటేశ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎన్కేపల్లి భూముల కేసులో నిందితుడి పరార్
మొయినాబాద్: ఎన్కేపల్లిలోని రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను నకిలీ పత్రాలతో విక్రయించిన వ్యక్తి కుటుంబంతో సహా అజ్ఞాతంలో కి వెళ్లిపోయాడు. 180 రెవెన్యూ సర్వే నంబర్ లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఇదే గ్రామానికి చెందిన డప్పు రమేశ్ ఫేక్ డాక్యు మెంట్లతో నగరానికి చెందిన పలువురు వ్యక్తుల కు విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నా డు. ఇందుకోసం అడ్వాన్స్‌గా రూ.1.50 కోట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై బి.లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశా రు. మంగళవారం ఉదయం రమేశ్‌ను అదుపు లోకి తీసుకోవాలని పోలీసులు భావించగా అప్పటికే అతను పరారైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలోని ప్రజాప్రతినిధులు, పెద్దలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ట్లు ప్రచారం సాగుతోంది. రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.