
అధికారుల నిర్లక్ష్యం తగదు
● పనితీరు మార్చుకోవాలి ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి
బడంగ్‌పేట్: ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ, మామిడిపల్లి, మల్లాపూర్ పరిధిలో అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్ పనులపై అధికారులను నిలదీశారు. సమస్యలపై స్పందించకుంటే తాను ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులు తదితర అంశాల్లో నేటికీ పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డీఈఈ వెంకన్న, ఏఈ హరీశ్, ఏఓ అరుణ, టీపీఓ కిరణ్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు వినయ్, సంపత్, రాకేశ్, కల్యాణ్, మేనేజర్ నాగేశ్వర్‌రావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.