
భూముల వద్ద రైతుల ఆందోళన
ఎన్కేపల్లి రైతులకు పట్టాల పంపణీ ఉద్రిక్తతల కు దారితీసింది. పరిహారం పెంచాలని కోరు తూ కొంతమంది బాధితులు మంగళవారం భూముల వద్ద రిలే దీక్షలు చేపట్టారు. బీఆర్‌ఎస్ నాయకుడు కార్తీక్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. అనంతరం చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు అన్యాయం చేయొద్దని, రైతులను విడదీసి పట్టాలు ఎలా పంపిణీ చేస్తా రని ప్రశ్నించారు. ఈ విషయమై అడిగేందుకు అక్కడికే వస్తున్నామంటూ మహిళా రైతులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి కదిలారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ రైతు చాకలి బాలమణిని కొట్టడంతో ఆమె పెద వికి గాయమైంది. ఈక్రమంలో కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. వీరిని పోలీసులు కట్టడి చేయడంతో ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు వద్దే ఆందోళన చేపట్టారు. ఎన్కేపల్లి మాజీ సర్పంచ్ అమర్‌నాథ్‌రెడ్డి కారు అటు వైపు రావడంతో ఆందోళనకా రులు వాహనంపై దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత సొంత పూచీకత్తుపై వదిలేశారు.