
ఔషధ మొక్కలకు భారతదేశం పుట్టినిల్లు
కందుకూరు: ఔషధ మొక్కలకు భారతదేశం పుట్టినిల్లని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణుప్రియ అన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా సోమవారం మండలంలోని నేదునూరు మోడల్ స్కూల్‌లో 20 రకాల ఔషద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచానికి వైద్యాన్ని, ఔషధాన్ని పరిచయం చేసిన గొప్ప దేశం మనదని కొనియాడారు. రోజు వారి దినచర్యలో ఔషధ మొక్కల వినియోగం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, వాటి ద్వారా పొందే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించడానికి మెడిసినల్ గార్డెన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గురురాజారెడ్డి, పుష్పలత, శ్రీనివాసాచారి, సురేష్, కొండల్‌రావ్, దామోదర్, వెంకటరమణ, జ్యోతి, సునీత, శేఖర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రజనీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.