
కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ దాడులు
యాచారం: కల్లు దుకాణాలపై ఇబ్రహీంపట్నం ఎకై ్సజ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. సీఐ సీతారాం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించి, విక్రయించే కల్లు నాణ్యమైనదేనా అని పరిశీలించారు. కొన్ని సీసాల్లో నిల్వ ఉన్న కల్లు తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. కల్తీ కల్లు విక్రయిస్తే వ్యాపారులపై కేసులు తప్పవని హెచ్చరించారు. పరిశుభ్రత లేకుండా కల్లును నిల్వ చేసి ఉంచడం, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా విక్రయించి రోగాల బారిన పడేలా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.