ముఖ్యమంత్రికి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

Jul 15 2025 12:28 PM | Updated on Jul 15 2025 12:28 PM

ముఖ్య

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

ఇబ్రహీంపట్నం రూరల్‌: ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నేతలు కలిసి ఘన స్వాగతం పలికారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎంకు ఆదిబట్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మర్రి నిరంజన్‌రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు.

శంకర్‌పల్లికి వచ్చిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌

శంకర్‌పల్లి: ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ సోమవారం శంకర్‌పల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చారు. మొయినాబాద్‌ మండలం చిన్నమంగళారం గ్రామ పరిధిలోని సుమారు 2000 వేల గజాల ఇంటి స్థలాన్ని అమ్మేందుకు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. దర్శకుడు వచ్చిన విషయం తెలియడంతో పలువురు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

విద్యార్థులు యుద్ధ విద్యల్లో రాణించాలి

షాద్‌నగర్‌: విద్యార్థులు యుద్ధ విద్యల్లో రాణించాలని స్కూల్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తిన చెన్నయ్య ఆకాంక్షించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పాఠశాలల క్రీడల కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ సౌత్‌ ఇండియా కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పట్టణంలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు గీత వెండి పతకం, ఐశ్వర్య రజిత పతకం సాధించారు. వారిని సోమ వారం కళాశాలలో సత్కరించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు, ఆటలు, యుద్ధ విద్యలు అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శైలజ, వైస్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతి, పీడీ రేణుక, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ

మొక్కలు నాటాలి

తుర్కయంజాల్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. పురపాలక సంఘం పరిధి తుర్కయంజాల్‌లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్‌ కె.అమరేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్‌ కొత్తకుర్మ మంగమ్మ, నాయకులు తాటిచెట్టు అశోక్‌ గౌడ్‌, తూళ్ల నర్సింహ గౌడ్‌, గౌడ సంఘం అధ్యక్షుడు గౌని రాజు గౌడ్‌, మాజీ అధ్యక్షుడు వెంకటేశ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
1
1/3

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
2
2/3

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
3
3/3

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement