
ఆయిల్ పామ్ సాగు మేలు
షాబాద్: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మండల పరిధిలోని పెద్దవేడులో రైతు పీసరి అనిత సురేందర్‌రెడ్డి పొలంలో చేపట్టిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లా ల్లో ఆయిల్‌పామ్ కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా పచ్చగా ఉంటేనే తెలంగాణ మొత్తం పచ్చబడుతుందని పేర్కొన్నారు. రైతులు సాగు చేసే పంటలకు కావాల్సిన డ్రిప్ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ఎకరానికి ప్రభుత్వమే రూ.51వేలు ఖర్చులకు అందిస్తుందని చెప్పారు. గుడిమల్కాపూర్ మార్కెట్‌ను అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేయాలన్న ఇక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ యస్మిన్‌భాషా, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేశ్, డీసీఓ సుధాకర్, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, పొల్యూషన్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఉద్యానవనశాఖ అధికారులు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు