
డెలివరీ బాయ్‌పై దాడి కేసులో ఇద్దరి రిమాండ్
అత్తాపూర్: డెలివరీ బాయ్‌పై దాడి కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రేహాన్ (20) పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 208 సమీపంలో జీప్టో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సులేమాన్ (25), యూనస్ (25)ను తోడుగా తీసుకువచ్చాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరో వ్యక్తిని ఎందుకు తీసుకువచ్చావు అని రేహాన్ సులేను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మరో ఇద్దరు స్నేహితులు ఇమ్రాన్ (25) సలీం (22) పిలిచాడు. నలుగురు కలిసి రేహాన్‌పై దాడి చేయడంతో పాటు పదునైన కత్తితో ఎడమ చేయి, ఎడమ కాలుపై గాయాలు చేసి పారిపోయారు. రేహాన్‌ను చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. రేహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.