
రూ.50 కోట్ల రుణ మంజూరు పత్రాల పంపిణీ
శంషాబాద్ రూరల్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముచ్చింతల్ శివారులో గల స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో గ్రామీణ స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ, పౌల్ట్రీ రంగాల వారికి రూ.50 కోట్ల రుణాల మంజూరు పత్రాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లు, మిల్లెట్ ఆహార పదార్థాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేశ్ రంజన్, సీజీఎం–వన్ సుధాకర్‌రావు, హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ సర్వేష్ రంజన్, సైఫాబాద్ రీజినల్ హెడ్ సోనాలికా తదితరులు పాల్గొన్నారు.