
ఇంజినీరింగ్‌లో మహేశ్‌కు డాక్టరేట్
మొయినాబాద్‌రూరల్: ఇంజినీరింగ్‌లో పరిశోధన చేసిన ఎనుముల మహేశ్‌కు డాక్టరేట్ లభించింది. ఇంజినీరింగ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆర్టిలిజేన్స్ ఇంటలిజెన్స్‌లో పరిశోధనకు గాను రాజస్థాన్ ఆజ్మిర్‌లోని భగవత్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పట్టాను అందుకున్నాడు. ఈ పరిశోధనకు 2021లో మహేశ్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి పెటెంట్ పొందారు. పరిశోధన ఫలితాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించిన నేపథ్యంలో వాటి ఆధారంగా డాక్టరేట్ దక్కింది. పట్టాను భగవత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.కె.శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు మహేశ్‌ను అభినందించారు.