
గొలుసు దొంగ రిమాండ్
మీర్‌పేట: చైన్ స్నాచర్‌ను మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. మీర్‌పేటవందనపురి కాలనీకి చెందిన చెవుల సంధ్య ఈ నెల 9న మధ్యాహ్నం సరుకుల కోసం సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా.. నాగర్‌కర్నూలు జిల్లా బిచినేపల్లి మండలానికి చెందిన సెంట్రింగ్ పనిచేసే కందనూలు మల్లేశ్(28) ఇల్లు అద్దెకు కావాలని ఆమెను వెంబడించాడు. సదరు మహిళ ఇంట్లోకి వెళ్లగా.. మరలా వచ్చి ఏదైనా పని ఇప్పించాలని అడిగి, ఆమె మెడలోని రెండు తులాల పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, ద్విచక్ర వాహనాన్ని స్వాఽధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.
యువకుడు అదృశ్యం
పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు గ్రామానికి చెందిన నర్సింహ కుమారుడు పాతకోట యాదగిరి(35) తుక్కుగూడలోని మారుతీ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న రోజు మాదిరిగానే విధులకు వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అతనికోసం తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సదరు వ్యక్తి బామ్మర్ది జగన్ గురువారం ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల తెలిసిన వారు ఠాణాలో కానీ.. 87126 62367 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.