మొయినాబాద్‌రూరల్: ‘ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తున్నాం. చిన్నారులకు ఉచితంగా పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మీ పిల్లల భవిష్య త్తు మాది’అని ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాధికారులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. బడీడు పిల్లలను, ప్రైవేటు బడి బాటలో ఉన్నవారిని సైతం సర్కారు బడుల్లో చేర్పించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంత వరకు బాగనే ఉన్నా.. పాఠశాలల ప్రారంభం అనంతరం సర్కారు బడుల్లో తిష్టవేసిన సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నా యి. తరగతి గదులు, సౌకర్యాల కొరత, ఉపాధ్యా యుల లేమితో చిన్నారుల విద్యాభ్యాసం ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు మొయినాబాద్‌మండలం అప్పారెడ్డిగూడ పాఠశాలే నిదర్శనం.
రోడ్డు పక్కన చెట్ల కింద..
మండల పరిధి అప్పారెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో 1– 5వ తరగతులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య 50కి పైగానే ఉంది. ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు భోదిస్తున్నారు. గత సంవత్సరంలో చిన్నారు సంఖ్య 38 ఉండగా.. ఈ ఏడాది అది స్వల్పంగా పెరిగింది. పాఠశాలకు మొత్తం ఒకే తరగతి ఉండటంతో ఐదు తరగతుల విద్యార్థులు బోధించడం కష్టంగా మారింది. దీంతో క్లాస్ రూమ్‌లో 1,2 తరగతులు, వరండాలో రెండు తరగతులు, రోడ్డు పక్కన చెట్ల కింద 5వ తరగతి వారికి పాఠాలు చెబుతున్నారు. బోధన విషయంలో ఉపాధ్యాయులు కృషి బాగానే ఉన్నా.. అదనపు గదులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరిన్ని గదులు నిర్మిస్తే నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని టీచర్లు పేర్కొంటున్నారు.
రోడ్డు పక్కనేవిద్యార్థులకు బోధన
పట్టించుకోని విద్యాధికారులు
సర్కారు బడులఅభివృద్ధిపై ప్రశ్నిస్తున్న గ్రామస్తులు
అదనపు గదులునిర్మించాలంటూ డిమాండ్
తరగతులు ఐదు.. గది ఒక్కటి