
ఒడిశా టు హైదరాబాద్
శంకర్‌పల్లి: హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను మంగళవారం మోకిల పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ మోకిల పీఎస్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన స్నేహితులు దాశరథి ప్రధాన్(26), సిబానాహక్(21), నీలుమండల్(21), సాగర్‌సాస్మల్(25) సులభంగా డబ్బు సంపాదించి, జల్సాలకు అలవాటు పడ్డారు. ఇందులో భాగంగా తక్కువ ధరకు ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి, నగరంలోని కార్మిక ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈక్రమంలో ఒడిశాలోని ప్రదీప్ అనే వ్యక్తి వద్ద రూ.16 వేలకు 38 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దీన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో కొల్లూర్ గేట్ సమీపంలోని బృందావనం గార్డెన్స్ వద్ద దాడి చేశారు. వీరి నుంచి 38కిలోల గంజాయి, 5ఫోన్లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మోకిల సీఐ వీరబాబు, ఎస్‌ఓటీ సీఐ అంజయ్య, ఎస్‌ఐ కోటేశ్వరరావు, సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు
38 కిలోల గంజాయి స్వాధీనం
నిందితులకు రిమాండ్