
రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి
బడంగ్‌పేట్: బాలాపూర్ మండలంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ.. బాలాపూ ర్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలు ఏళ్ల తరబడి తిష్టవేశారని అన్నారు. తనపై రెక్కీ సైతం నిర్వహించారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ప్రగతి పథంలో
మహిళా సంఘాలు
చేవెళ్ల: ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మహిళా సంఘాలు ఎంతో ప్రగతి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని సెర్ప్ జిల్లా అధికారి నర్సింహ, ఏపీఎం శోభారాణి అన్నారు. మండలకేంద్రంలోని మహిళా శక్తి భవనంలో మంగళవారం మహిళా శక్తి సంబరాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం విద్యార్థుల యూనిఫామ్ కుట్టు కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలకు చైర్మన్‌లుగా ఏర్పాటు, పౌల్ట్రీ, డెయిరీ, పాడి పరిశ్రమ, ఎంటర్‌ప్రైజెస్, సోలార్‌యూనిట్లు, ఆర్టీసీ బస్సులు, గోదాంలు, పెట్రోల్‌బంక్‌లు తదితర వాటిని కేటాయిస్తోందని తెలిపారు. సంఘాలను బలోపేతం చేసుకునేందుకు మహిళలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు భారతి, మండల సీసీలు, సమాఖ్య సభ్యులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రేపు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం
చార్మినార్: ఆషాఢమాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. సప్త మాతృకలకు సప్త బంగారు బోనంలో భాగంగా ఇప్పటికే మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి, రెండో బోనాన్ని విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి.. మూడో బోనాన్ని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, నాలుగో బోనాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించారు. అయిదో బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు.

రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి