
మద్యం దుకాణంలో చోరీ
చేవెళ్ల: మద్యం దుకాణానికి దొంగలు కన్నం వేశారు. రూ.4.38 లక్షలకు అపహరించారు. ఈ సంఘటన షాబాద్ చౌరస్తా సమీపంలోని వైన్‌షాపులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ నర్సింహ వైన్‌షాపులో నంద్యాల రాజేందర్‌రెడ్డి క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం షాపు మూసే సమయానికి రూ.3లక్షల 8వేలు, పక్కనే కూల్‌పాయింట్ నిర్వహించే శ్రీశైలం ఇచ్చిన అద్దె రూ.1.30 లక్షలు మొత్తం రూ.4లక్షల 38వేలను రాత్రి షాపులో పెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం దుకాణానికి వచ్చి చూసే సరికి.. వేనుకభాగంలో గోడకు రంధ్రం చేసి ఉంది. అనుమానం వచ్చి షాపులోని డ్రాను చూడగా అందులోని డబ్బులు కనిపించలేదు. దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత ముగ్గురు వ్యక్తులు.. మాస్కులు ధరించి షాపు లో చొరబడి నగదు కాజేసినట్లు రికార్డు అయింది.వెంటనే యజమానికి సమాచారం చేరవేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాపు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
విజయనగర్‌కాలనీ: యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘట న సోమవారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..మహ్మద్ తౌఫిక్ తన కుటుంబంతో కలిసి ఆసిఫ్‌నగర్ సాబేర్‌నగర్‌లో నివసిస్తూ వంట పని చేస్తాడు. ఇతని కుమారుడు మహ్మద్ దావూద్(20) గుడిమల్కాపూర్ పూ లమార్కెట్‌లో పనిచేస్తాడు. సోమ వారం మధ్యాహ్నం 2 గంటలకు తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసు కున్నాడు. కుటుంబసభ్యులు స్థాని కులు సహాయంతో కిందికి దించి ప రీక్షించగా అప్పటికే అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.